పెళ్లైన యువకుడితో వద్దన్నందుకు..
యువకుడిలో ప్రేమ వద్దన్నందుకు పురుగుల మందు తాగి ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమికులను వెంకటేశ్, దివ్యగా పోలీసులు గుర్తించారు. వెంకటేశ్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కాగా.. దివ్య మందమర్రి వాసిగా స్థానికులు తెలిపారు. అయితే వెంకటేశ్‌కు ఇది వరకే వివాహం అయింది. అంతేకాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వెంకటేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడితో యువతి ప్రేమలో పడింది. వారి పెళ్లి గురించి కుటుంబ సభ్యులను సంప్రదించారు. కానీ వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.