Add --3

భార్యకు తెలియకుండా టిక్‌టాక్‌లో మొదలైన పరిచయం ఎంతదాకా వెళ్లిందో తెలిస్తే

భార్యకు తెలియకుండా టిక్‌టాక్‌లో మొదలైన పరిచయం ఎంతదాకా వెళ్లిందో తెలిస్తే..
 


విజయవాడ: టిక్‌టాక్ పరిచయం పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. భార్య ఉండగానే టిక్‌టాక్‌లో మరో మహిళతో భర్త పరిచయం పెంచుకున్నాడు. అంతటితో ఆగక.. వారి పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. పరిచయమైన మహిళను భార్యకు తెలియకుండా తిరుపతికి తీసుకెళ్లి ఆ భర్త పెళ్లిచేసుకున్నాడు. విజయవాడకు చెందిన వీటీపీఎస్ ఉద్యోగి సత్యరాజు చేసిన నిర్వాకమిది. పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో భార్యను హత్య చేసేందుకు సత్యరాజు ప్లాన్ చేశాడు. అయితే.. అదృష్టవశాత్తూ ఆ భార్య భర్త పన్నాగాన్ని పసిగట్టి.. అతని నుంచి తప్పించుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.